Wednesday, May 15, 2024

గ్రాండ్ విషెస్‌.. కేబుల్ బ్రిడ్జి మీద కార్లపై ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్’ అంటూ వినూత్న ప్ర‌ద‌ర్శ‌న‌

టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ ఇవ్వాల (ఆదివారం) బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్నారు. ఆయ‌న‌కి ఉద‌యం నుంచి ప‌లువురు వేర్వేరు విధాలుగా విషెష్ చెబుతున్నారు. కొంత‌మంది గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో పేద‌ల‌కు స‌హాయం చేస్తున్నారు. కాగా, వేధం ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ లీడ‌ర్ అయిన అలిశెట్టి అరవింద్ కాస్త డిఫ‌రెంట్‌గా కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరానికే కొత్త ఐకాన్‌గా నిలిచిన‌ కేబుల్ బ్రిడ్జిపై కార్లను నిలిపి వాటిపై హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ రాసి ప్రదర్శించారు. యువ నేతగా, శాస్త్ర సాంకేతిక రంగాలపై పట్టు ఉన్న తమ నాయకుడి చొరవతో ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలు హైదరాబాద్ విశ్వనగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. గొప్ప లీడ‌ర్ లక్షణాలు కలిగిన తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement