Friday, April 26, 2024

కెమికల్‌ గోదామ్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో మంటలు చెలరేగాయి. గోదాము నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…. ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. గోదాములో భారీ శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. గోదాము పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. గోదాములోకి వెళ్లే మార్గం లేకపోవడంతో అధికారులు జేసీబీలతో గోడలు కూల్చివేస్తున్నారు. భారీగా శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement