Saturday, May 4, 2024

క్యాన్స‌ర్ తో పోరాడుతూ..సీనియ‌ర్ గాయ‌ని శార‌ద క‌న్నుమూత‌

క్యాన్స‌ర్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు సీనియ‌ర్ గాయ‌ని శార‌ద‌.ఆమె వ‌య‌సు 89.1966లో వచ్చిన ‘సూరజ్’ చిత్రంలోని ‘తిత్లీ ఉడి’ పాటకు ఫేమస్ అయ్యారు. ఆరు నెలల పాటు చికిత్స పొందిన ఆమె ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణవార్తను ఆమె కుమార్తె మదీరా సోషల్ మీడియాలో పంచుకున్నారు. మదీరా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషాద వార్తను పోస్ట్ చేశారు. ‘క్యాన్సర్ తో సుదీర్ఘ, సాహసోపేతమైన పోరాటం తర్వాత మా ప్రియమైన తల్లి, నేపథ్య గాయని శారదా రాజన్ కన్నుమూశారని నేను, నా సోదరుడు షమ్మీ రాజన్ చాలా విచారంతో ప్రకటిస్తున్నాం. 25.10.1933 – 14.06.2023. ఓం శాంతి అని పేర్కొన్నారు.

ఆమె ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా ఆమె చికిత్స పొందుతోంది. కాగా.. ఆమె మరణం పట్ల సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. శారద పూర్తి పేరు శారదా రాజన్ అయ్యంగార్. తమిళనాడుకు చెందిన ఆమెకు చిన్న వయస్సు నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టం. పలు సందర్భాల్లో ఆమె తన అభిరుచిని ప్రదర్శించేవారు. శారద 1960-1970 లలో గణనీయమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ముఖ్యంగా, జహాన్ ప్యార్ మిలే (1970) చిత్రంలోని బాత్ జరా హై ఆపస్ కీ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. అయితే సూరజ్ (1966) చిత్రంలోని తిత్లీ ఉడి పాటతో ఆమె అందరి హృదయాలను గెలుచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement