Tuesday, May 21, 2024

Bhatti’s People’s March – కెసిఆర్ న‌యా నిజాం…

కనగల్‌, ప్రభన్యూస్‌: ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ సీఎం కేసీఆర్‌ నయా నిజాంలా పాలి స్తున్నాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరో పిం చారు. భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నిన్న లచ్చుగూడెం స్టేజి వద్ద ప్రారంభమై కన గల్‌, పర్వతగిరి, ధర్వేశిపురం స్టేజి మీదుగా జి.చెన్నా రం గ్రామం వరకు సాగింది. కరగల్లో నిర్వహిం చిన కార్నర్‌ మీటింగ్‌లో భట్టి విక్రమార్క మాట్లా డుతూ, ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్‌.. ప్రశ్ని ంచేవారిపై కేసులు బనాయించి అణిచివేయాలని చూ స్తున్నట్లు- మండిపడ్డారు. ఆదిలాబాద్‌ నుంచి చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలిసి సమస్యలను తెలు సుకున్నట్లు- వివరించారు. డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యో గం జాడలేదన్నారు. కేవలం కేసీఆర్‌ కుటు-ంబం అధికా ర పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు బాగుపడ్డారని వేల కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. జిల్లాకు సాగు తాగు నీటికీ శాశ్వత పరిష్కారమైన ఎస్‌ఎల్‌బీసీ సొరం గం పనులను పూర్తి చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రాతిని ధ్యం వహిస్తున్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డిలతో జిల్లాకు ఒరిగింది శూన్యమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొ రంగం పనులను కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రారంభిం చిందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వమే పూర్తి చేస్తదని వివరిం చారు.

అంతకుముందు భట్టి పాదయాత్రకు స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర సక్సెస్‌ కావడంతో కాంగ్రెస్‌ నేతల్లో కొత్త జోష్‌ కనిపిం చింది. ఆయా కార్యక్ర మాల్లో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దుబ్బాక నర సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్‌ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, పున్న -కై-లాస్‌, నల్లగొండ జడ్పిటిసి వం గూరు లక్ష్మయ్య, వైస్‌ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ బిక్షం యాదవ్‌, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సర్పంచ్‌లు నర్సింగ్‌ సునీత కృష్ణయ్య గౌడ్‌, గోలి నర్సిరెడ్డి, దేప నరేందర్‌ రెడ్డి, బోగరి రాం బాబు, ఉప్పునూతల వెంకన్న యాదవ్‌, మహిళా నా యకురాలు సూరెడ్డి సరస్వతి, నరేష్‌ రెడ్డి, మాజీ ఎంపీ టీ-సీలు, మాజీ సర్పంచులు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement