Friday, May 3, 2024

రికార్డ్‌ స్థాయిలో ఫాస్ట్‌ట్యాగ్‌ కలెక్షన్స్‌.. ఒక్క రోజులో 193.15 కోట్లు

దేశంలో అన్ని టోల్‌గేట్ల వద్ద ఏప్రిల్‌ 29న ఒక్క రోజులోనే రికార్డ్‌ స్థాయిలో 193.15 కోట్ల రూపాయల ఫాస్ట్‌ ట్యాగ్‌ ద్వారా వసూలయ్యాయి. ఆ ఒక్క రోజులోనే 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ మొత్తం వచ్చిందని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నుంచి వాహనదారులకు ఫాస్ట్‌ ట్యాగ్‌ను తప్పనిసరి చేసింది. టోల్‌ గేట్ల వద్ద దీని ద్వారానే టోల్‌ రుసుం ఆటోమెటిగ్గా వసూలవుతుంది. దేశంలో టోల్‌ ప్లాజాల సంఖ్య 770 నుంచి 1,228కి పెరిగాయని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఇందులో స్టేట్‌ టోల్‌ ప్లాజాలు 339 ఉన్నాయి.

- Advertisement -

ఫాస్ట్‌ ట్యాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీతో పని చేస్తుంది. వాహనదారుడి బ్యాంక్‌ అకౌంట్‌తో ఇది లింక్‌ చేయడం వల్ల ఆటోమెటిగ్గానే టోల్‌ మొత్తం చెల్లింపు జరుగుతుంది. టోల్‌ ప్లాజాలతో పాట ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో 140 పార్కింగ్‌ ప్రాంతాల్లోనూ ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా పార్కింగ్‌ రుసుం కూడా వసూలు చేస్తున్నట్లు జాతీయ రహదారుల సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement