Monday, April 29, 2024

Follow up | ముగ్గురు ఐపీఎస్‌లకు పదోన్నతి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో 2005 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్‌ పొందిన వారిలో అవినాష్‌ మొహంతి, పి.విశ్వప్రసాద్‌, ఎం.రమేష్‌లు ఉన్నారు. ప్రస్తుతం సైబరాబాద్‌ అదనపు కమిషనర్‌ (అడ్మిన్‌)గా ఉన్న అవినాష్‌ మహంతి పదోన్నతి తర్వాత కూడా అక్కడే కొనసాగుతారు. హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌ (ఎస్బీ)గా ఉన్న విశ్వప్రసాద్‌, పోలీస్‌ ప్రొవిజన్స్‌, లాజిస్టిక్స్‌ ఐజీగా ఉన్న రమేష్‌ కూడా యధాస్థానంలోనే విధులు నిర్వర్తిస్తారు.


పదోన్నతి పొందిన ఐపీఎస్‌ అధికారి ఎం. రమేష్‌ మంగళవారం బాద్యతలు స్వీకరించారు. ఆయన గత 25 సంవత్సరాలుగా రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో డీఎస్పీగా, అక్కడే అడిషనల్‌ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వెళ్ళారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్వెస్టిగేషన్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రధాన భద్రతాధికారిగా, అవినీతి నిరోధకశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిలల్‌ఆ ఎస్పీగా, గ్రేహౌండ్స్‌ ఎస్పీగా కూడా పనిచేశారు. 2018లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఐజీ హోదాలో పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement