Friday, April 26, 2024

ఢిల్లీ-ముంబై మధ్య రూ.లక్ష కోట్లతో ఎక్స్‌ప్రెస్ వే

దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీకి దూరం తగ్గించాలన్న సంకల్పంతో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం సన్నద్ధమైంది. దాదాపు 1350 కిలోమీటర్ల దూరం గల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ.లక్ష కోట్ల బడ్జెట్‌తో పూర్తిచేయనున్నారు. ఐదు రాష్ట్రాల మీదుగా సాగే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ముంబై-ఢిల్లీ మధ్య దూరం 350 కిలోమీటర్ల మేర తగ్గనున్నది. కరోనా కారణంగా పనులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఈ ప్రాజెక్టును 2023 జనవరి కల్లా పూర్తిచేయాలని నిర్ణయించారు.

ముంబై-న్యూఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్‌వే పనుల కోసం తొలుత ఆరు లైన్‌లతో రోడ్డు నిర్మాణం చేపట్టానున్నారు. అనంతరం మరో నాలుగు లైన్‌ల పనులను చేపడతారు. ఈ నాలుగు లైన్‌లలో ఎలక్ట్రిక్‌ వాహనాలను నడిపేందుకు మాత్రమే కేటాయించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ముంబై నుంచి ఢిల్లీకి కేవలం 13 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇప్పుడు ఇదే దూరాన్ని పూర్తిచేయడానికి దాదాపు 25 గంటల సమయం పడుతోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి కాలుష్యాన్ని నివారించేలా ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌, స్మార్ట్‌ సిటీస్‌ కూడా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. ఈ రోడ్డులో మొత్తం 92 ప్రాంతాలను ఇంటర్వెల్‌ స్టాప్స్‌గా తయారుచేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement