Thursday, September 23, 2021

కోహ్లీ కెప్టెన్సీ మార్పు: భూటకపు వార్తలన్న బీసీసీఐ అధికారి..

విరాట్ కెప్టెన్ కెప్టెన్సీ మార్పుపై ఒక్కసారిగా చెలరేగిన వార్తలపై బీసీసీఐ స్పందించింది. ప్రపంచ కప్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకొని.. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించడంలో నిజం లేదని ఆయన తెలిపారు. ఈ విషయం పైన అసలు ఎటువంటి చర్చ కూడా జరగలేదని స్పష్టం చేసారు. అలాగే ఈ టీ20 ప్రపంచ కప్ తర్వాత కూడా అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడు అని తేల్చేసారు. ఈ వార్తలు మోత భూటకమని బీసీసీఐ అధికారి అరుణ్ ధుమాల్ కొట్టిపారేశారు. ఇక వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ. వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరించనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ వన్డే, టీ20 ఫార్మట్స్ లో తన కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడని ఈ రోజు ఉదయం నుంచి వార్తలు భారీగా వచ్చాయి. ఈ మధ్య బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోతున్న కోహ్లీ పై ఎక్కువ భారం, ఒత్తిడి పడుతుందని… అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొని… బ్యాటింగ్ పైన దృష్టి పెట్టాలని కోహ్లీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా వీటిపై తాజాగా బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: కెప్టెన్ గా రోహిత్..విరాట్ పై వేటు..?

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News