Friday, April 26, 2024

CSK vs GT | దుమ్మురేపిన సీఎస్‌కే.. గుజ‌రాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవ్వాల జరుగున్న మ్యాచ్‌ సీఎస్‌కే జట్టు దుమ్మురేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగుల చేసింది. సీఎస్‌కే బ్యాటర్లో శివమ్ దూబే (51) అర్ధ సెంచరీతో గుజరాత్ బౌలర్లపై చెలరేగగా.. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) పరుగులతో తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఇక డారిల్ మిచెల్ (24), సమీర్ రిజ్వీ (14), రవీంద్ర జడేజా (7)ఆకట్టుకున్నారు.

ఇక, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 207 పరుగుల లక్ష్యంతో గుజరాత్ బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement