Saturday, April 27, 2024

మార్చిలో ఐపీఎల్​కి అంతా రెడీ.. ఓ రోజు ముందుగానే సీజ‌న్ స్టార్ట్..

ప్ర‌పంచ క్రికెట్‌లో ఎంతో ఆధ‌ర‌న పొందిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) తాజా సీజ‌న్‌కు సిద్ధ‌మైపోయింది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల వేలం పూర్తైన సంగ‌తి తెలిసిందే… వాస్త‌వానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌ను మార్చి 27న ప్రారంభించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. అయితే ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్ట‌ర్‌గా ఉన్న స్టార్ ఇండియా అభ్య‌ర్థ‌న మేర‌కు ఓ రోజు ముందుగానే సీజ‌న్‌ను ప్రారంభించాల‌ని బీసీసీఐ సిద్ధ‌మైపోయిన‌ట్టుగా తెలుస్తుంది.

అంటే మార్చి 27కు ఓ రోజు ముందుగా మార్చి 26న‌ సీజ‌న్‌ను మొద‌లుకానుంది. మార్చి 26వ తేదీ (శ‌నివారం) లీగ్‌ను ప్రారంభిస్తే తర్వాతి రోజయిన‌ ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్‌లు) జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా ఈ ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చిన‌ట్లు బీసీసీఐ ప్ర‌తినిధి తెలిపారు. ఈ విష‌యానికి సంబంధించి మ‌రో రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌ద‌రు అధికారి పేర్కొన్నారు. అదే రోజు లీగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement