Tuesday, April 30, 2024

ఇండియన్‌ ఎథ్నిక వేర్‌ బ్రాండ్‌ లిబాస్‌.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా సారా అలీఖాన్‌

భారతీయ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ ఎత్నిక్‌ వేర్‌ బ్రాండ్‌ అయిన లిబాస్‌, తమ స్పింగ్‌ సమ్మర్‌ 2022 ప్రచారం దెరీస్‌ ఆలేస్‌ అలిబస్‌తో తమ మొదటి సెలబ్రిటీ- బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ను ప్రకటించి ఎథ్నిక్‌ ఫ్యాషన్‌ ప్రియుల అంచనాలు పెంచింది. లిబాస్‌ సీఈఓ అండ్‌ ఎమ్‌డి సిధాంత్‌ కేశాని మాట్లాడుతూ…. తన సామర్థ్యాలపై స్పష్టమైన, సంతృప్తికరమైన అవగాహన కలిగి సరళంగా, నమ్మకంగా, సౌకర్యవంతంగా ఉండే, సారా తమ టీమ్‌లో సభ్యురాలు అయినందుకు తాము చాలా సంతోషిస్తున్నామన్నారు.

లిబాస్‌ స్పింగ్‌ సమ్మర్‌ 2022 ప్రచారం దెరీస్‌ ఆలేస్‌ అలిబస్‌ భారతీయ ఎథ్నిక్‌ ఫ్యాషన్‌ తాజా దృక్పథాన్ని వెల్లడిస్తుందన్నారు. బ్రాండ్‌ ఆధునిక భారతీయ మహిళ ఇష్టపడే దుస్తుల శైలి అవసరాలను అర్థం చేసుకుంటు-ందన్నారు. సారా అలీ ఖాన్‌ భాగసామ్యం గురించి మాట్లాడుతూ… లిబాస్‌తో అనుబంధం కావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. లిబాస్‌ అత్యంత సౌకర్యవంతమైన ఎథ్నిక్‌ వేర్‌ను అందిస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement