Sunday, May 19, 2024

దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్.. అసలు విషయం ఇదే..!

టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఇవ్వాల పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లేపై మూడు సార్లు ప్రత్యక్షమైంది. అయితే ఈ మెసేజ్ చూసిన వారు ఇక్క సారిగా ఉలిక్కిపడి.. ఏమైందోనని భయాందోళనలకు గురయ్యారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేసారి అలర్ట్ చేసేందుకు ఇలాంటి అలర్ట్ మెసేజ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర టెలి కమ్యూ నికేషన్ విభాగం తెలిపింది.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. ఆ మెసేజ్‌లో ఏముందంటే.. “ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది” అని అందులో ఉంది. మొదట ఇంగ్లిష్ భాషలో అలర్ట్ రాగా.. తరువాత తెలుగు, హిందీ భాషల్లో కూడా ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది.

భూకంపాలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సునామీ వస్తుందని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ తో ఫోన్లకు అత్యవసర సందేశాలు పంపుతుంది. ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అలర్ట్ ను ప్రయోగాత్మకంగా పంపుతున్నారు. ఇప్పటికే జూలై 20, ఆగస్టు 17న కూడా కేంద్రం ఎమర్జెన్సీ మెసేజ్‌లు పంపించింది. తాజాగా నేడు మరోసారి టెస్ట్ చేసింది. కాగా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement