Monday, April 29, 2024

హ్యాపీ బ‌ర్త్ డే బావ‌.. మంత్రి హ‌రీస్ రావుకు శుభాకాంక్ష‌లు తెలిపిన ఎమ్మెల్సీ క‌విత‌

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ట్వీట్ చేశారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు బావ‌.. ఆయురారోగ్యాల‌తో, నిండు నూరేళ్లు జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్టు క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి హ‌రీష్ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌నకు రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. హ‌రీశ్‌రావు అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తనపై ఉన్న ప్రేమను ప్రజ‌లకు ఉప‌యో‌గ‌పడే సేవా కార్య‌క్ర‌మాల ద్వారా చాటా‌లని అభి‌మా‌నులు, కార్య‌క‌ర్త‌లకు హ‌రీశ్‌రావు సూచించిన సంగ‌తి తెలిసందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement