Monday, May 6, 2024

స‌త్య‌దేవ్ న‌టిస్తోన్న కృష్ణ‌మ్మ‌-ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌

మొద‌టి సారి పూర్తి స్థాయి యాక్ష‌న్ క‌థ‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు హీరో స‌త్య‌దేవ్. ఆ చిత్రమే కృష్ణ‌మ్మ‌. వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మ‌ల‌పాటి నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేశారు. ఏమ‌వుతుందో మ‌నలో’ అంటూ సాగే మెలోడియ‌స్ గీతాన్ని డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. కాల‌భైర‌వ మ‌రోసారి త‌న మ్యూజిక్‌తో శ్రోత‌ల‌ను ఫిదా చేస్తున్నారు. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్‌కు జోడీగా అతిరా రాజీ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement