Sunday, May 12, 2024

ఎలన్‌ మస్క్‌ తల్లి గ్యారేజీలో నిద్రించింది

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్‌ మస్క్‌ తల్లి ఓ రోజు తన ఇంటి సమీపంలో ఓ గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చిందని స్వయంగా తల్లి మయే మస్క్‌ వెల్లడించింది. అది కూడా టెస్లా స్పేస్‌ ఎక్స్‌ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్నట్లు వెల్లడించింది. 74 సంవత్సరాల మయె మస్క్‌ తన వ్యక్తిగత జీవితమంతా కష్టాలమయమని చెప్పింది. మొదటి భర్తనుంచి విడిపోయి ముగ్గురి పిల్లలతో జీవితమంతా దుర్భరంగా సాగిందన్నారు. తన కుమారుడు ఎంత డబ్బు సంపాదించిన వాటిపై అంత ఆసక్తి ఉండదని చెప్పింది. స్పేస్‌ పైకి వెళ్లాలనే కోరిక కూడా తనకు లేదని.. తన పిల్లలు వెళ్లాలని కోరితే వెళతానని అన్నారు.

2020కి ముందు సొంత ఇల్లుకూడా లేకుండా ఉన్నాడని..ప్రస్తుతం ప్రపంబ బులీనియర్లలో ఒకరుగా కొనసాగుతున్నాడని వెల్లడించింది. స్పేస్‌లో స్థలం కొనడానికి 50వేల డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని దానికోసం మొత్తాన్ని అమ్ముతాతనన్నాడని మయే మస్క్‌ అన్నారు. ఒకానొక సమయంలో తన ముగ్గురు పిల్లలకు కనీస ఆహారం కూడా అందించలేక పోయానని ట్విట్టర్‌లో తన పాత జ్ఞాపకాలను పంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement