Friday, April 26, 2024

Big Story | కోతల నుంచి మిగులు దిశ‌గా విద్యుత్‌.. కేసీఆర్‌ దార్శనికత, ముందుచూపుతోనే సాధ్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యుత్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్థిని సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, పవర్‌ హాలీడేలు ఉండేవి. రాష్ట్రం విడిపోతే తెలంగాణాలో విద్యుత్‌ ఉండదని, తెలంగాణ అంధకారమవుతుందని సమైఖ్య వాదులు చేసిన తప్పుడు ప్రచారాన్ని.. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వాటిని పటాపంచలు చేశారు. ఏ రాష్ట్రమైన అభివృద్థి స్థాయిని కొలిచే అత్యంత ముఖ్యమైన సూచీలలో విద్యుత్‌ వినియోగం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

విద్యుత్‌ అనేది మౌళిక సదుపాయాల్లో అత్యంత కీలకంగా నిలవడంతో పాటు రాష్ట్ర సంక్షేమానికి ఎంతో ముఖ్యమంది. సీఎం కేసీఆర్‌ ముందు చూపు.. దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ కోతల నుంచి మిగులు విద్యుత్‌ దిశగా పరగులు పెట్టింది. తెలంగాన ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 18,567 మెగావాట్ల సామర్థ్యానికి తెలంగాణ చేరుకున్నది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్‌ రంగం బలోపేతం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం రూ. 39,321 ఖర్చు చేసింది.

వివిధ వర్గాలు, పలు రంగాలకు ఉచిత విద్యుత్‌..

ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ వివిధ వర్గాలు, పలు రంగాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. రాష్ట్రంలో 27.49 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల పాటు ఉచితంగా 100 శాతం సబ్సిడీతో విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా 8 లక్షల వ్యవసాయ సర్వీసు కనెక్షన్లను ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పేద వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.

- Advertisement -

6 లక్షల 258 మంది ఎస్సీ వినియోగదారులు, 3 లక్షల 26 వేల 358 మంది ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వం ప్రతి నెలా 101 యూనిట్ల విద్యుత్‌ వాడకం వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తోంది. అదే విధంగా వృత్తినే ఉపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్న 30,013 మంది నాయిబ్రాహ్మణుల వినియోగదారులు, 55,458 దోబీఘాట్లు, లాండ్రీ షాపులకు ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. అదే విధంగా 546 పౌల్ట్రిd ఫారాలు, 6,097 పవర్‌ లూమ్‌లకు యూనిట్‌కు రూ. 2 సబ్బిడీని ప్రభుత్వం అందిస్తోంది.

వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌..

దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అన్ని రంగాలకు ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని 27.49 లక్షల మంది రైతులు ఉచిత విద్యుత్‌ను పొందుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో విద్యుత్‌ కోతలు, పవర్‌ హాలీడేల నుంచి అనతి కాలంలోనే శాశ్వత విముక్తిని సాధించింది. 2014కు ముందు స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండగా, ఇప్పుడు 18,567 మెవాట్లకు పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రాన్స్‌మిషన్‌ నెట్‌ వర్క్‌ను బలోపేతం చేయడానికి రూ. 18,874 కోట్లు ఖర్చు చేసి.. మెరుగైన విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్కును పునరుద్ధరించింది.

పల్లె ప్రగతి కార్యక్రమం కింద రూ. 506 కోట్లు, పట్టణ ప్రగతి కింది రూ. 249 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రం విభజన తర్వాత డిస్కంల ద్వారా 1062 కొత్తగా 33/11కేవీ సబ్‌స్టేషన్లు, 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 1.83 లక్షల కిలోమీటర్ల డిస్ట్రీబ్యూషన్‌ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 22,722 మంది విద్యుత్‌ కార్మికుల సర్వీసులను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ను అందించేందకు రూ. 11,500 కోట్లను డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలకు సబ్సిడీగా చెల్లిస్తోంది.

జాతీయ స్థాయి కంటే తలసరి విద్యుత్‌ వినియోగం తెలంగాణలో 69.40 శాతం ఎక్కువగా నమోదు..

తలసరి విద్యుత్‌ వినియోగం సైతం ఒక ప్రధాన ప్రగతికి సూచికగా నిలుస్తోంది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ సగటలో చూస్తే 1,255 యూనిట్లుగా ఉన్నది. అంటే తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం కంటే జాతీయ స్థాయిలో విద్యుత్‌ వినియోగం కన్నా 69.40 శాతం నమోదు కావడం తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.

భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్ల నిర్మాణం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్‌లో గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టుగా గుర్తించబడిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. నల్లగొండలోని దామరచర్లలో టీఎస్‌ జెన్‌కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి పవర్‌ ప్లాంట్లు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది.

జల విద్యుత్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి..

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయడంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి సోలార్‌ పవర్‌ కేవలం 74 మెగావాట్ల మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఇప్పుడు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి సామర్థ్యం 5,865 మెగావాట్లకు చేరింది. జల విద్యుత్‌ ఉత్పత్తిలో 2021-22 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాని కంటే రికార్డు స్థాయిలో 5,654.7 మెగావాట్ల ఉత్పత్తిని సాధించడం జరిగింది.

భూపాలపల్లి కేటీపీసీలో విద్యుత్‌ ప్లాంట్‌..

గడిచిన 10 ఏళ్లలో టీఎస్‌ జెన్‌కో ఆధ్వర్యంలో కాకతీయ పవర్‌ ప్లాంట్‌ ( కేటీపీఎస్‌)లో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్త గూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ( స్టేజ్‌ 7) లో 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 1080 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభమైనాయి. కేవలం 48 నెలల రికార్డు సమయంలోనే కేటీపీఎస్‌ వద్ద 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ.. 2025 నాటికి 18,223 మెగావాట్లకు చేరుకుని విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

15,479 మెగావాట్లకు పెరిగిన విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌..

రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో గరిష్ట డిమాండ్‌ 13,162 మెగావాట్లు మాత్రమే ఉండేది. స్వరాష్ట్రంలో ఈ ఏదాది మార్చి 30న గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 15,479 మెగావాట్లు, మార్చి 14న రికార్డు స్థాయిలో 297.89 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు 2014లో 1.11 కోట్లు కాగా, 2023 మే 1 నాటికి 1.78 కోట్ల వరకు విద్యుత్‌ కనెక్షన్లు పెరిగాయి. అందులో వ్యవసాయ కనెకక్షన్లు 27.49 లక్షలు ఉన్నాయి. రాష్ట్ర విభజన నాటికి 19.03 లక్షల వ్యవసాయ కనక్షన్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement