Tuesday, May 7, 2024

ఎలక్ట్రిక్‌ లూనా వస్తోంది .. త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్న కైనెటిక్‌

మన దేశ మార్కెట్‌లో గతంలో విశేష ఆదరణ పొందిన లూనా ను తిరిగి తీసుకురానున్నట్లు కైనెటిక్‌ గ్రూప్‌ తెలిపింది. పాత లూనాకు బదులు ఈ సారి విద్యుత్‌ లూనాను తీసుకు వస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించింది. కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ ఇ-లూనాను తీసుకు రానుంది. ఇప్పటికే కైనెటిక్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ లూనాకు సంబంధిచిన ఛాసిస్‌, ఇతర విడిభాగాల తయారీని ప్రారంభించింది. కొత్త లూనా కోసం మెయిన్‌ స్టాండ్‌, సైడ్‌ స్టాండ్‌, స్వింగ్‌ ఆర్మ్‌ భాగాలను తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రారంభంలో నెలకు 5 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రత్యేక అసెంబ్లి లైన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

రానున్న 2-3 సంవత్సరాల్లో లూనా విక్రయాల ద్వారా అదనంగా 30 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గతంలో రోజుకు 2 వేల లూనాలు విక్రయాలు జరిగేవి. మళ్లిd ఆ స్థాయికి చేరుకుంటామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంజిక్య ఫిరోడియా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ మార్కెట్‌లో లూనా 50 సంవత్సరాల క్రితం తొలిసారి వచ్చింది. అప్పుడు ప్రారంభ ధర 2వేలు. ప్రస్తుతం వస్తున్న ఇ-లూనా విడిభాగాలు, పెయింటింగ్‌తో సహా అన్ని అహ్మదాబాద్‌ ప్లాంట్‌లోనే తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement