Monday, May 6, 2024

దేశంలో ఏడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏడు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్‌ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో రెండు రాజ్యసభ సీట్లు, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 5 రాజ్య సభ స్థానాలు భర్తీ కానున్నాయి.

ఆయా రాజ్యసభ స్థానాల కోసం ఈ నెల 15న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే నెల 22న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అలాగే 27న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇక ఈ రాజ్యసభ ఎన్నికలు అక్టోబర్‌ 4న జరుగనున్నాయి. అలాగే కౌంటింగ్‌ కూడా అదే రోజు పూర్తి కానుంది. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ప్రభుత్వం వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement