Thursday, May 9, 2024

Health : గుడ్డు హెల్త్‌కి వెరీగుడ్డు .. ఏట్లాంటి ఉప‌యోగాలో తెలుసుకుందాం

కోడిగుడ్డులో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్‌ శాచురేటెడ్‌ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. గుడ్లను సరైన పద్ధతిలో ఉడికించి రోజుకు ఒకటి, రెండు చొప్పున తినొచ్చు. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్‌, జింక్‌, విటమిన్‌-ఇ , ఫొల్లేట్‌లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఉడికించిన గుడ్డులో 6.29గ్రాముల ప్రోటీన్స్‌, 78 క్యాలరీలుంటాయి. గుడ్డు తిననివారికి కూడా దీని ప్రయోజనాలు తెలిస్తే వారు గుడ్డు తినడానికి ప్రయత్నిస్తారు.

కళ్ల సంరక్షణ : కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజూ గుడ్డు తినేవారికి కంటికి సంబంధించిన వ్యాధులు, శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసొనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి.

ప్రోటీన్లు పుష్కలం: ఎగ్‌ వైట్‌లో పుష్కలమైన అల్బుమిన్‌ ఉంది. ఇది ప్రోటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

క్యాల్షియం పెంపొందిస్తుంది: ఎగ్‌వైట్‌ వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి ఓస్టియోపొరోసిస్‌ను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

డైలీ ఎగ్‌: గుడ్డులోని తెల్లసొనలో హిస్టోడిన్‌, పచ్చసొనలో జింక్‌, కోలిన్‌, అయోడిన్‌, లినోలిక్‌ యాసిడ్‌ ఉంటాయి. వీటితో కొత్త మేధస్సు కణాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. వీటితో పాటు అధికంగా ప్రోటీన్లు, న్యూట్రిషియంట్స్‌, అంతే కాకుండా ఇందులో కొలెస్ట్రాల్ర్‌ ఉండదు. గుడ్డులోని పచ్చసొన పిల్లతో పాటు గర్భిణులకు కూడా చాలా ఆరోగ్యకరం.

- Advertisement -

మంచి ఫ్యాట్స్‌ : గుడ్డులోని పచ్చసొనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలిన్‌ అనే ధాతువు, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడు సార్లు రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం, గుండెజబ్బులు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.

బెస్ట్‌ క్యాన్సర్‌ నివారిస్తుంది: అల్బుమిన్‌ అనే పోషకాంశంలో సెలీనియం అనే కెమికల్‌ కలిగి ఉండి, మన శరీరంలో ఏర్పడే క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నివారిస్తుంది. పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

జుట్టు సంరక్షణకు: గుడ్డు పచ్చసొన వల్ల శిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. గోళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement