Sunday, May 5, 2024

సమాజానికి తరగని ఆస్తి విద్యే : మంత్రి బొత్స

గరివిడి, విజయనగరం : బాలల భవిష్యత్తు బాగుంటేనే దేశం బాగుంటుందని, విద్యే తరగని ఆస్తి అని భావించిన ముఖ్యమంత్రి దేశం లో ఎక్కడా లేని విధంగా విద్యా రంగానికి నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక ద్వారా బాలలకు కార్పొరేట్ విద్య నందించడమే కాకుండా, రక్తహీనత లేకుండా చూడాలని మద్యాహ్న భోజనం లో రాగి జావ ను కూడా మెనూగా చేర్చారని అన్నారు. ఏ పథకానికి లంచాలు లేవు, దళారీలు లేవు, పారదర్శకంగా అర్హతే ప్రామాణిక గా ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే రాష్ట్రం బాగుంటాదని, మన ఊరుతో పాటు ప్రతి కుటుంభం బాగుంటుందని అన్నారు. గరివిడి మండలం తొండ్రంగి గ్రామం లో 25 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, 17.50 లక్షలతో నిర్మించిన వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ ను ఆదివారం మంత్రి బొత్స ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ .. బాలల భవిష్యత్తు కోసం వారి తల్లి తండ్రుల కన్నా ముఖ్యమంత్రి ఎక్కువగా ఆలోచిస్తున్నారని తెలిపారు. మన బడి నాడు నేడు క్రింద 14 లక్షలతో తొండ్రంగి జిల్లా పరిషత్ హై స్కూల్ అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. గ్రామంలో ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో గ్రామానికి 7 కోట్ల 80 లక్షల రూపాయలను పలు సంక్షేమ పేదల కోసం ఖర్చు చేశామని తెలిపారు. గతం లో ఇంత పెద్ద మొత్తం లో ఎప్పుడైనా లబ్ది జరిగిందా అని ప్రశ్నించారు. గ్రామం లో 409 పింఛన్లను అందిస్తున్నామని, అర్హత ఉండి అందని వారుంటే వారికీ ఇస్తామని అన్నారు. ఇంటి0 టికీ కుళాయి ని అందించడం జరిగిందని, ఇంకనూ మిగిలిపోయిన పనులను చేసి చూపిస్తామని అన్నారు. గడప గడపకు వస్తున్నామని, ఎవరికి ఏమేమి పథ‌కాలు అందించామో తెలియజేస్తామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే తెలియజేయాలని అన్నారు. ప్రతి కుటుంభం తలెత్తుకొని గౌరవంగా బ్రతికేలా ప్రభుత్వం చూస్తుందని, గ్రామస్థలందరుఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని,దీవెనలు అందించి జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని కోరారు.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, అన్ని వేళలా అందరికి అందుబాటులో ఉంటున్నామని అన్నారు. గడప గడపకు వస్తున్నామని, అందరితో మాట్లాడుతామని, దీవించాలని అన్నారు. పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం అన్నారు. విత్తు నుండి విక్రయం వరకు రైతు భతోసా కేంద్రాలు రైతులకు అండగా నిలుస్తున్నాయన్నారు. నాలుగేళ్లలో 13 కోట్ల నిధులతో పంచాయతి అభివృద్ధి జరిగి0దన్నారు. ఇక పై ఎం.ఆర్.ఓ, ఎం.పి.డి.ఓ కార్యాలయాలకు వెళ్లకుండా గ్రామం లొనే ఉండి సచివాలయం ద్వారానే సేవలన్నింటిని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, ఆర్.డి.ఓ అప్ప రావు, తహసీల్దార్ తాడ్డి గోవింద్, ఎం.పి.డి.ఓ భాస్కర రావు, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ డా. అశోక్ కుమార్, డి.ఎం.హెహెచ్.ఓ డా.రమణ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు, ఇంజనీరింగ్ అధికారులు , జెడ్ పి టి సి లు, ఎంపిపి లు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement