Tuesday, May 14, 2024

Editorial – అజెండాల బంతాట‌…

బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని కర్నాటకలో కాంగ్రెస్‌ మంత్రివర్గం నిర్ణయిం చింది. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల వాగ్దానం చేసింది.ఇప్పుడు ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు జరిపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదే విధంగా పాఠ్య పుస్తకాల నుంచి వీర్‌ సావర్కార్‌ వంటి సంఘ్‌ పరివార్‌ నాయకుల జీవితచరిత్రలను తొలగించాలని కూడా కాంగ్రెస్‌ మంత్రివర్గం నిర్ణయించింది.ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లి ఆమోదించినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీనిని ఆమోదించాలి, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి..ఇన్ని జరిగితే కానీ ఈ చట్టంరద్దు కాదు. ఇందుకు సంబంధిం చిన బిల్లును తీసుకుని రావడానికి కర్నాటకలో బసవ రాజ్‌ బొమ్మయ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసింది.గత డిసెంబర్‌లో బెల్గాంలో జరి గిన అసెం బ్లి శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి హడావుడిగా ఆమోదింపదేశారు. రాష్ట్రప్రభుత్వం చర్యను ముస్లిం, క్రైస్తవ సంఘాలు వ్యతిరేకకించాయి. బెంగళూరు లోనూ, బల్గాం తదితర నగరాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన లు నిర్వహించాయి.బిల్లు ప్రతులను ఆనాటి ప్రతిపక్ష నాయకుడు,ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌ అసెంబ్లి లో చించి వేశారు.ఇలాంటి బిల్లును ఇంతకు ముందే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆమోదించా యి.

ముందుగా ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం దీనికి చట్టరూపం ఇచ్చింది. ఈ బిల్లులో చాలా పకడ్బందీగా నిబంధనలు చేర్చారు. ఎస్సీలు, ఎస్టీలు మతం మార్చుకుంటే అంతవరకూ పొందుతున్న రిజర్వేషన్లను కోల్పోవల్సి ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. మతం మార్చుకున్న వ్యక్తి 30 రోజుల్లోగా మేజస్ట్రేట్‌కి లిఖితపూర్వకంగా తెలియజే యాలన్న నిబంధననుకూడా చేర్చడం జరిగింది. మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలను వేధించడం కోసమే ఈ బిల్లును తెచ్చారని అప్పట్లో కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇది ఎన్నికల అంశం కావడంతో ఇటీవల అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ వ ర్గాల ఓట్లను గంపగుత్తగా చేజిక్కించుకున్నాయి. మత మార్పిడులు తరతరాలుగా జరుగుతున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం సంఘ్‌ పరివార్‌ నాయకు లు దీనిని పెద్ద రాద్దాంతం చేశారు. మతం మార్పు అనేది ఐచ్ఛికంగా జరిగేది. అయితే, ప్రలోభాలకు లోబడి మతం మార్చుకున్న వారు, ఇప్పటికీ మార్చుకుంటున్న వారూ ఉన్న మాట నిజమే. వీరిసంఖ్య తక్కువ,ఇటు హిందువులుగానూ, అటు అన్యమతస్తులుగానూ ప్రయోజనాలు పొందుతున్న వారున్నారు.వీరిలో పలువురు రాజకీయ పదవులను అనుభవిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించ వచ్చు. వివిధ రాష్ట్రాల్లో మతమార్పిడి నిరోధక చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగవచ్చు. మతం అనేది వ్యక్తుల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. దానిని బలవంతంగా రుద్దే అధికారం ఎవరికీలేదు. బ్రిటిష్‌ వారి కాలంలో బ్రిటిష్‌ పాలకులు ఈ మత మార్పిడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటి నుంచి మతంమార్పిడి అనేది సమాజంలో ఒక సాధారణ అంశం అయింది. కర్నాటక లో బీజేపీ ప్రభుత్వం సంఘ్‌ పరివార్‌ అజెండాని అమలు జేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. హిజాబ్‌ ధారణ విషయంలోనూ, మహాత్మాగాంధీ హత్యకేసులో ముద్దా యి అయిన గాడ్సే విగ్రహాలను ప్రతిష్టించడం, రోడ్లకు అతడి పేరు పెట్టడం వంటి చర్యలకు పాల్పడింది. తాము అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను తిరగ తోడతామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఇప్పుడు అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటోందనీ,ఇందులో రాజకీయ వివాదం ఏమీ లేదని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.

ఈ నిర్ణయాల పర్యవసానం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఒత్తిళ్ళు పెంచి, తాయిలాలను ఆశజూపి వివాహం చేసుకుంటా నని నమ్మించి మతం మార్పిడిని ప్రోత్సహిస్తే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలను తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే జామీను లేని అరెస్టు చేస్తారు.మత మార్పిడి లకు పాల్పడే వ్యక్తులకు మూడు నుంచి పదేళ్ళ జైలు, 50వేల రూపాయలు జరిమానా విధిస్తారు. పాఠ్య ప్రణాళికల్లో బీజేపీ ప్రభుత్వం చేసిన మార్పులన్నింటినీ రద్దు చేయాలని కాంగ్రెస్‌ మంత్రివర్గం నిర్ణయించింది. పిల్లల చదువులు ఈ రెండు పార్టీల బంతి ఆట వల్ల దెబ్బ తింటాయేమోనని తల్లితండ్రులు ఆందోళన చెందుతు న్నారు. కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో దీనిని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకునే అవకాశమూ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement