Saturday, October 12, 2024

Adipurush: రాముడిగా ప్ర‌భాస్ అల‌రించాడా..ఈ రివ్యూ మీ కోసం

ఎన్నో వివాదాలు చుట్టిముట్టినా ఆదిపురుష్ రిలీజ్ ని ఆప‌లేక‌పోయాయి.. ఎట్ట‌కేల‌కు నేటి నుండి థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది ఈ చిత్రం. మ‌రి ఈ చిత్రంలో స్టార్ హీరో ప్ర‌భాస్ ని రాముడిగా ప్రేక్ష‌కులు అంగీక‌రించారా..లేదా ..ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

క‌థ ఏంటంటే.. రాఘవుడు (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్), సోదరుడు శేషు (సన్నీ సింగ్)తో కలిసి వనవాసానికి వెళతాడు. రాఘవ మోహన రూపం చూసిన శూర్పణఖ అతనితో మోహం లో పడి తన భర్తగా ఆహ్వానిస్తుంది. నేను వివాహితుడిని. క్షమించండి అని రాఘవుడు తప్పకుంటాడు.దాంతో కోపం తెచ్చుకుని జానకి ఉండబట్టే కదా అలా మాట్లాడాడు అని ఆమెను చంపాలని విఫల యత్నం చేస్తుంది. తన వదినను రక్షించే క్రమంలో శేషు వేసిన బాణం సూర్పణఖ ముక్కుకు తగులుతుంది. అవమానంతో లంకకు వెళ్లిన సూర్పణఖ… అన్నయ్య లంకేశుడు (సైఫ్ అలీ ఖాన్) దగ్గర మొరపెట్టుకుంటుంది. అంతేకాదు తన అన్నను రెచ్చగొట్టడానికి ..జానికి అందం గురించి గొప్పగా చెప్తుంది. దాంతో తన చెల్లి ముక్కు కోసిన వారికి బుద్ది చెప్పటానికి..జానికిపై మోహావేశంతోనూ సాధువు వేషధారణలో వెళ్లిన లంకేశుడు…జానికిను అపహరించి లంకకు తీసుకొస్తారు. అప్పుడు రాఘవ ఊరుకోడు కదా …భజరంగి , ఆయన వానర సైన్యం సహాయంతో ..లంకపై దండెత్తి హోరాహోరీ రాఘవుడు చేస్తాడు..కానీ లంకేష్ కు బ్రహ్మ ఇచ్చిన ఓ వరం ఉండటంతో ఆయనకు మరణం లేదు. ఈ విషయం తెలిసిన రాఘవ ఏం చేసారు…? భజరంగి ఈ యుద్దంలో ఎలా సాయిం చేసారు…వంటి విషయాలు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

- Advertisement -

విశ్లేషణ.. నిజ జీవిత చరిత్రలు తెరకెక్కించేటప్పుడు, లేదంటే పురాణాలు ఇతిహాసాల ఆధారంగా సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మాత్రం మార్పులు,చేర్పులలో తేడా చేసినా ఈ సోషల్ మీడియా యుగంలో ట్రోల్స్ తప్పవు.ఆదికావ్యం…ఆదిపురుష్ గా అనువర్తన జరిగేటప్పుడు అనేక మార్పులు జరిగాయనటంలో సందేహం లేదు. అయితే ఆ మార్పులు మూలాన్ని పెకలించలేదు కానీ మోడ్రన్ మేకింగ్ పేరుతో చేసిన మార్పులతో మాత్రం బాగోలేవు . వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఈ జనరేషన్ పిల్లలకు హారీ పోటర్ తరహాలోనే మన పురాణాలు చెప్తేనే అర్దమవుతాయనుకుని తీసినట్లు అనిపించే సినిమా ఇది. మార్వెల్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలను తరహాలో రామాయణాన్ని ప్రెజెంట్ చేసారు. అందుకు తగ్గట్లుగా కథనాన్ని డిజైన్ చేసారు. ఆ సినిమాలు చూసి, ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ నచ్చుతుందనే ఆలోచనే ఈ కథ,కథనాన్ని నడిపించింది. వాళ్లు అనుకునే ఈ జనరేషన్ పిల్లలు, కుర్రాళ్లు ఈ సినిమాకు వస్తే ఎంజాయ్ చేయగలగుతారు. అదే సమయంలో తాము చూసిన సూపర్ హీరోలు, గేమ్స్ లో ఉండే కొన్న విజువల్స్ ఈ సినిమాలో కనపడి విసుక్కుంటారు. అయితే కొన్నిసార్లు కొత్తను ఆహ్వానించవలిసిందే.

ఫస్టాఫ్ సినిమా బాగానే నడిచిపోయింది. సినిమా వర్కవుట్ అయ్యిందనుకునేలోగా సెకండాఫ్ వచ్చి బోర్ కొట్టించేస్తుంది. అందుకు కారణం దాదాపు ఎక్కువ శాతం కథ ఫస్టాఫ్ లో నే వచ్చేయటం. సినిమా సెకండాఫ్ లో ఎక్కువ భాగం యుద్దం ఎపిసోడ్ తో నిండిపోయి విసుగెత్తించింది. అలాగని మొత్తం ప్రయత్నాన్ని తప్పు పట్టలేం. గతంలో రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాల్లో లాగానే ఈ సినిమాను తీస్తే ఇంక ఎందుకు పనిగట్టుకుని ఈ సినిమా చూడటం…ఆ సినిమాలే రీరిలీజ్ చేసుకుంటే పోయేది కదా…అలాగని కొత్త పేరుతో రోతను అందించకూడదు. మరీ సినిమాటెక్ లిబర్టీ కాకపోతే రావణుడు అంత వింతగా ఎందుకు ఉంటాడు..మన దేశవాశిలా అనిపించడు. అలాగే రెగ్యులర్ తెలుగు సినిమాలు ఎక్కువగా చూసి, విలన్ పాత్రలను ఆవాహన చేసుకున్నట్లు విచిత్రంగా బిహేవ్ చేస్తూంటాడు.

న‌టీ న‌టుల న‌ట‌న‌.. ఈ సినిమాలో ప్రభాస్ చేయటానికి ఏ అవకాశాన్ని స్క్రిప్టు ఇవ్వలేదు. అలా నడుచుకుంటూ వెళ్తూ , అప్పుడప్పుడూ బాణం సంధిస్తూ ఉంటాడు. పూర్తి ప్యాసివ్ పాత్ర అనిపిస్తుంది. ఆయన ఎమోషన్స్ ఏమీ మనకు అందవు. అలాగే మీసాలతో రాముడు ఉంటాడా అంటూ చాలా మంది ఈ సినిమా ఫస్ట్ లుక్ రాగానే ప్రశ్నించారు. అయితే రాముడుకు మీసాలా ఉన్నాయా లేవా అనే విషయం ప్రక్కన పెడితే..సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ అనుమానం అయితే రాదు. అలాగే వినయ విధేయ రాముడుని ఇన్నాళ్లు చూసాం. ఈ సారి ఫెరోషియస్ గా ఉండే రాముడు ఈ సినిమాలో కనపడతాడు. అందుకే మీసాలు మెయింటైన్ చేసారేమో అనిపిస్తుంది. ఇక రావణుడు గా …చేసిన సైఫ్ …లుక్ , డ్రస్ పరంగా అసలు బాగోలేదు కానీ నటన వరకూ మెప్పించాడు. . కృతి .. సీతాదేవి గా కన్నా హిందీ సినిమాల జానకి గానే కనిపిస్తుంది. హనుమంతుడు పాత్ర ఎంపిక మాత్రం వంద శాతం కరెక్ట్ గా అనిపించింది.దేవదత్త నాగే బాగా ప్లస్ అయ్యారు. లక్ష్మణుడు పాత్ర …ఎంతచూసినా నార్త్ ఫేస్ క్రిందే అనిపిస్తుంది. మిగతావాళ్లు కథలో కలిసిపోయారు.

సాంకేతిక‌త‌ …:సాంకేతికంగా ఈ సినిమా ఇంకా బాగా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో అంతదారుణమైన విఎఫ్ ఎక్స్ వర్క్ శాకుంతలం లో ఈ మధ్యన కనపడింది. మళ్లీ ఈ సినిమాలో కనపడింది. హాలీవుడ్ సినిమాలలో అదిరిపోయే విఫెక్స్ లతో చూసేస్తున్న టైమ్ లో అంతకు మించి ఉంటే కానీ ఆనని పరిస్దితి. ఇక సినిమాలో హైలెట్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ సెకండాఫ్ లెంగ్త్ తగ్గించే కార్యక్రమం పెడితే బాగుండేది. రావణుడు తలలు VFX లో దారుణంగా కార్టూన్స్ లాగ ఉంటాయి. ఫైనల్ అవుట్ ఫుట్ లో అవి ఎందుకు చూసుకోలేదో..లేక అదే కొత్త అని ఫీలయ్యారో.. డబ్బింగ్ విషయానికి వస్తే..డైలాగులు అచ్చం ..డబ్బింగ్ ఫీల్ రావాలని రాసినట్లు అనిపిస్తాయి. పాటల్లో …రాఘవ్, జానకిల ప్రేమలోని గాఢతను తెలిపే మెలోడి ‘రామ్ సీతా రామ్’ పాట బాగుంది. ”జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం . అంటూ సాగే డివోషనల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రావణుడితో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో వచ్చే ఈ పాట బాగా క్లిక్ అయ్యింది.మొత్తానికి ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఉంది ఈ చిత్రం..మొద‌టిరోజే కాబ‌ట్టి ప్రేక్ష‌కులు ఏం తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement