Monday, April 29, 2024

Encounter – జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్..అయిదుగురు ఉగ్రవాదులు హతం..

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు నిర్దిష్ట సమాచారం అందడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి చేపట్టిన గాలింపు సందర్భంగా ఉగ్రవాదులతో ఎదురు కాల్పులు జరిగాయని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement