Friday, May 3, 2024

Editorial – చైనాలో పెట్టుబడులు తిరోగ‌మ‌నం …

చైనాలో కరోనా వ్యాప్తి కారణంగా పలు విదేశీ కంపెనీ లు ఇతర దేశాలకు తరలిపోయాయి. ఇప్పుడు ద్రవ్యోల్బ ణం కారణంగా ప్రతిష్టాత్మకమైన కంపెనీలు బిచాణా సర్దేసుకుంటున్నాయి. అంతేకాక, చైనాలో విదేశీ పెట్టు బడిదారులకు వడ్డీ రేట్లు బాగా తక్కువగా ఉండటం ప్రధాన కారణం. వడ్డీ రేట్లు మాత్రమే కాకుండా, అమెరి కా, చైనాల మధ్య సంబంధాల్లో అనిశ్చిత స్థితి మరో కారణం. చైనా సెంట్రల్‌ బ్యాంకు తమ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు వడ్డీరేట్లను తగ్గించవచ్చని హ్యాంగ్‌సంగ్‌ బ్యాంకుకి చెందిన ప్రధాన ఆర్థిక వేత్త డాన్‌ వాంగ్‌ తెలిపా రు. ఫలితంగా చైనా కరెన్సీ యువాన్‌పై మరింత ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక రంగం లో సెంటిమెంట్లు బలపడితే పరిస్థితి మెరుగు పడవచ్చ నీ, లేని పక్షంలో సెంట్రల్‌ బ్యాంకు కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పదని డాన్‌వాంగ్‌ అన్నారు. చైనా నుంచి విదేశీ కంపెనీలు తరలి వెళ్ళిపోవడానికి మరో కారణం కూడా ఉంది. చైనా కంపెనీలకు హాంకాంగ్‌లోని సంస్థల తో వాణిజ్య సంబంధాలు ఎక్కువ. హాంకాంగ్‌తో చైనా ప్రభుత్వం సంబంధాలు మెరుగుగా లేకపోవడంవల్ల చైనాలోని విదేశీ కంపెనీలు ఇబ్బందులకు గురి అవుతు న్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరుగనున్న చర్చలు ఒకవైపు ఆశలను చిగురింపజేస్తున్నా, మరో వైపు ఆ చర్చలపై ఎక్కువ ఆశలు పెట్టుకోనవసరం లేదని నిపుణు లు స్పష్టం చేస్తున్నారు.

ఇరుదేశాల మధ్య దౌత్య సంబం ధాలు మెరుగు పడితేనే ఆర్థిక అంశాలపై ఇరుదేశాల నాయకులు దృష్టి పెట్టే అవకాశం ఉందనీ, దౌత్య సంబం ధాలు మెరుగు పడే అవకాశాలు కనిపించడం లేదని వారు స్పష్టంచేస్తున్నారు. చైనా నుంచి అమెరికన్‌ కంపెనీ ల పెట్టుబడుల ఉపసంహరణకు కేవలం దౌత్య సంబం ధాలు సవ్యంగా లేకపోవడమే కారణం కాదనీ, అది కూడా ఒక కారణం కావచ్చనీ, అదే ప్రధాన కారణం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. తమ పెట్టుబడులకు ఆశించిన ప్రతిఫలం దక్కడంతో కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని వారు అన్నారు.అయితే, ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా రష్యాకు బహిరంగంగా మద్దతు ఇవ్వ డంవల్ల సంబంధాలు చాలా వరకూ దెబ్బతి న్నాయనీ, అలాగే, ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య జరుగు తున్న యుద్ధం ప్రభావంవల్ల చాలా కంపెనీలు స్వదేశా లకు వెళ్ళిపోవాలన్న ఆలోచనలో పడ్డాయని చెబుతు న్నారు. కెనడాకి చెందిన ఫిరాన్‌ టెక్నాలజీస్‌ గ్రూపు గడిచిన దశాబ్దంలో 7.2 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ వెనక్కి వెళ్ళిపోవాలను కుంటోంది.అయితే, పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోవడం లేదనీ, కొన్ని పెట్టుబడులు చైనాలోనే కొనసాగుతాయని ఆ కంపెనీ పేర్కొంటోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అనుసరిస్తున్న విధానాలు నచ్చక కొన్ని కంపెనీలు మొత్తంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నా యి.

స్విస్‌కి చెందిన పారిశ్రామిక యంత్రాల తయారీ సంస్థ ఓర్లీంకన్‌ గత ఏడాది 277 మిలియన్‌ డాలర్ల పెట్టు బడులను ఉపసంహరించు కుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. చైనా విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ ప్రతినిధి అన్నా రు. ఇతర దేశాల వాణిజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకో వడం చైనాలో విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతోం ది. చైనా ఆర్థికవ్యవస్థపై విదేశీ కంపెనీల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావం హెచ్చుగా ఉంటోంది. ముఖ్యం గా, గడిచిన సెప్టెంబర్‌తో అంతమైన త్రైమాసికంలో 11.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయా యి. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వెనక్కి వెళ్ళడం 1998 తర్వాత ఇదే ప్రథమమని అంటున్నారు. జిన్‌పింగ్‌ అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమన్న విమర్శ లు వస్తున్నాయి. జిన్‌పింగ్‌ విధానాలను విమర్శించిన రక్షణ మంత్రి సెర్గీ షోయిగో బర్తరఫ్‌ అయ్యారు. ఇంకా మరి కొంతమందిలో అసంతృప్తి ఉన్నా, పదవి పోతుం దేమోనన్న భయంతో వెనకాడుతున్నారు. జిన్‌పింగ్‌ నియంతృత్వ ధోరణులను అనుసరిస్తున్నారన్న అభిప్రా యాన్ని పలువురు ప్రైవేటు సంభాషణల్లో వ్యక్తం చేస్తు న్నారు.

హాంకాంగ్‌, తైవాన్‌ల విషయంలో జిన్‌పింగ్‌ అనుసరిస్తున్న విధానం చాలామందికి నచ్చడం లేదు. వాటివల్ల చైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందనీ, వాటి పై దూకుడు పెంచడం సరైన విధానం కాదని చాలా మం ది అభిప్రాయపడుతున్నారు. మహామార్గం పేరిట చైనా పొరుగుదేశాల భౌగోళిక ప్రాంతాల్లో చొచ్చుకుని వెళ్ళ డం, శాశ్వత నిర్మాణాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం వంటి చర్యల ప్రభావం కూడా ఆర్థిక పరిస్థితిపై కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవడానికి బదులు పొరుగు దేశాలతో, అస్మదీయ దేశాలతో ఘర్షణ లకు పాల్పడటం జిన్‌పింగ్‌ అనుసరిస్తున్న తొందరపాటు విధానాలని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement