Sunday, April 28, 2024

WGL : భద్రాద్రిలో బాలసాని మార్క్.. బీఆర్ఎస్​కు బిగ్ షాక్

వాజేడు, నవంబర్ 15 (ప్రభ న్యూస్): భద్రాచలం నియోజకవర్గం లో బాలసాని మార్కు తో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాజేడు వెంకటాపురం మండలాలలోని బీఆర్ఎస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.వాజేడు మండలం కృష్ణాపురం ఎంపీటీసీ చిట్టిబాబు. మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ప్రస్తుత వాజేడు సొసైటీ అధ్యక్షులు యగ్గడి అంజయ్య బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాకర్లపూడి శ్రీనివాస్ రాజు నల్లగాసి రమేష్ తో 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి.

దీనితో బి ఆర్ ఎస్ పార్టీ నేతల్లో గుబులు రేకెత్తుతుంది. దీనిని కప్పిపుచ్చడానికి ఇక్కడి బిఆర్ఎస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు సాగిస్తూ పై నాయకుల మెప్పుకోసం ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులకే బిఆర్ఎస్ కండువలు కప్పి పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారంచేసుకుంటున్నారు. కానీ వాజేడు వెంకటాపురం మండలాలలో బిఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. దీనిని గమనించకపోతే టిఆర్ఎస్ పార్టీ పప్పులొ కాలేసినట్లే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చక్రం తిప్పుతూ తన అనుచర వర్గాన్ని తన వైపు వచ్చేలా విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. వాజేడు మండలానికి చెందిన ఐదుగురు సర్పంచులు ముగ్గురు ఎంపీటీసీలు బాలస్వామి లక్ష్మీనారాయణకు టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈనెల 20న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన నేపథ్యంలో వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిని బట్టి చూసినట్లయితే టిఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష పేరుతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులను రహస్యంగా కలిసి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. భద్రాద్రిలో ఎలాగైనా తన మార్కు చూపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తన ప్రయత్నాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య గెలుపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement