Tuesday, May 14, 2024

సూర్యగ్రహణం ప్రారంభం…

ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు కొనసాగుతోంది. దాదాపు మొత్తం 5 గంటల 25 నిమిషాల పాటు గ్రహణం ఉండనుంది .అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. పశ్చిమ ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాలు, చైనా, థాయ్‌లాండ్, అమెరికా, మలేషియా, జపాన్, న్యూజిలాండ్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే కనిపిస్తుంది.ఈ సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రెండు రకాల గ్రహణాలు ఒకేసారి కనిస్తాయన్నాయని తెలిపారు. భారత దేశంలో కనిపించకపోయినప్పటికీ, దీనిని ఆన్‌లైన్‌లో చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుని ఛాయ(నీడ) ఆస్ట్రేలియా అంచులో 40 కిలోమీటర్ల విస్తృతితో ఉండే మార్గంలో పడుతుందని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement