Monday, April 29, 2024

EC – ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌పై వేటు

ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల సంఘం ఆదేశం
మిజోరం, హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ ప‌రిపాల‌న కార్య‌దర్శి తొల‌గింపు
ముంబై మ‌నిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, అద‌న‌పు, డిప్యూటీ
క‌మిష‌న‌ర్లు సైతం ఇంటికే
ప‌శ్చిమ బెంగాల్ డిజిపిపై వేలాడుతున్న ట్రాన్స్ ఫ‌ర్ క‌త్తి

న్యూ ఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా, మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు.
పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)ని తొలగించడానికి ఎన్నికల సంఘం కూడా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు స‌మ‌చారం. అలాగే బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement