Wednesday, May 1, 2024

Earthquake – అఫ్గానిస్థాన్ భూకంపంలో రెండు వేలు దాటిన మృతుల సంఖ్య …

కాబూల్‌: అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. శనివారం సంభవించిన ప్రకృత్తి విపత్తు కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ విపత్తులో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వీడియాకు వెల్లడించారు. భూప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో వరుసగా ఏడు సార్లు ప్రకంపనలు రాగా వీటిలో అయిదు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎన్నో భవనాలు నెలమట్టం అయ్యాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భూకంప కేంద్రమైన హెరాత్‌ జిల్లాలో నాలుగు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement