Monday, April 29, 2024

Israel vs Palastine war – హ‌మాస్ కు అండ‌గా హెజ్బొల్లా, ఇరాన్ …. ఇరువైపుల భారీగా ప్రాణ న‌ష్టం ..

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. ఆదివారం హెజ్బొల్లా గ్రూప్‌ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఈ స్థావరాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలోని గోలన్‌హైట్స్‌ వద్ద ఉన్నాయి. ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది. తాము పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా దాడి చేసినట్లు ప్రకటన చేసింది. ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. జిబ్‌డెన్‌ ఫామ్‌, షీబా ఫామ్స్‌ వద్ద ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్‌ నుంచి మద్దతు లభించిందని హమాస్‌ ప్రకటించింది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది. మరోవైపు హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తిప్పికొట్టాయి. కాకపోతే ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం వెల్లడించలేదు. తమపైకి మోర్టార్‌ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించంది. గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ 1981లో స్వాధీనం చేసుకుంది.

ఇరు వైపుల భారీగా ప్రాణ న‌ష్టం..

తాజాగా ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 300 దాటింది. 1500 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హమాస్‌ దాడులపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దళం పాలస్తీనాలోని గాజా పై విరుచుకుపడింది. దీంతో అక్కడ 300 మందికిపైగా ఈ దాడుల్లో మరణించారు. దీంతో ఇరువైపులా మరణాల సంఖ్య 600 దాటింది. ఇదిలా ఉండగా.. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ సైనికులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement