Monday, April 29, 2024

E D Raids – తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్

చెన్నై – తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలోని ఆయన ఆఫీసులో.. కోయంబత్తురు, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.. దాదాపు 18 గంటల పాటు మంత్రిని ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు నేటి ఉదయం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రి సెంథిల్ బాలాజీ భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆధారాలు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లభించడంతో ఇవాళ ఉదయం ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఛాతినొప్పి అంటూ ఒక్కసారిగా మంత్రి సెంథిల్ బాలాజీ కూలిపోయారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే అవకాశ కనిపిస్తుంది. తమిళనాడు చీఫ్ సెక్రటేరియట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సోదాలు, కరూర్ నివాసంలో నిర్వహించిన తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement