Wednesday, May 1, 2024

దసరా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న మూవీ

‘దసరా’ సినిమాతో థియేటర్లలో ధూమ్ ధామ్ చేసిన నేచురల్ స్టార్ నాని… అతి త్వరలో, ఓటీటీలో సందడి చేయనున్నారు. తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల అయ్యింది. కాగా వచ్చే వారం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. దసరా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 27న ఓటీటీలో విడుదల చేయనుంది.

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన సిినమా ఇది. దసరాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించింది. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement