Friday, December 6, 2024

Drugs Case – త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కు ఎన్ ఐ ఎ నోటీసులు ..

తమిళ న‌టి వరలక్ష్మి శరత్‌కుమార్‌‌కు కేరళ ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఆమెకు సమన్లు ఇచ్చారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పీఏ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా,కేరళలోని విళంజియం సమీపంలో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఆదిలింగంను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ సరఫరాతో వచ్చిన డబ్బులను అతడు సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. దీనిపై మ‌రింత స‌మాచారాన్ని సేక‌రించేందుకు ఎన్ ఐ ఎ ఆమెకు నోటీసులు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement