Tuesday, May 30, 2023

లాడ్జీ గదిలో వైద్యుడి బలవన్మరణం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పెద్దాపురంకు చెందిన వైద్యుడు ఒకరు హైదరాబాద్‌లోని లాడ్జీ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంకు చెందిన అనిల్‌ (31) ఖమ్మంలోని మమత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. అతడు ఈ నెల 22వ తేదీన అఫ్జల్‌గంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఒక లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం లాడ్జీ సిబ్బందికి అనుమానం వచ్చి అనిల్‌ గదిని పరిశీలించగా విగతా జీవుడై ఉన్నాడు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు గదిని పరిశీలించారు.

అనిల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు గదిలో ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి ఔషధాలను తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయాన్ని పెద్దాపురంలోని అనిల్‌ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వస్తే ఆత్మహత్యకు కారణాలేమైనా తెలియవచ్చని పోలీసులు చెప్పారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement