Friday, April 19, 2024

గ్రూప్‌ -1 ప్రొవిజినల్‌ జాబితా విడుదల..

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రూప్‌ 1 పరీక్షల్లో ప్రొవిజినల్‌ గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరంతా ఓరల్‌ టెస్ట్‌(ఇంటర్వ్యూ)లకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్‌ కింద షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాలను వెబ్సైట్‌ లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు జూన్‌ 15న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరుగుతాయని స్పష్టం చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన వారి సర్టిఫికెట్ల పరిశీలన జూన్‌ ఆరో తేదీన జరుగుతాయని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement