Friday, April 19, 2024

హిందీ ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి : ఒంటేరు శ్రీనివాసులరెడ్డి..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హిందీ ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంకాల్‌ కొండయ్య, గాండ్లపర్తి శివానందరెడ్డి విద్యాశాఖ కమిషనర్‌ కు లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. జాతీయ విద్యా విధానం అనుసరించి ఉన్నత పాఠశాలల్లో 600 మంది విద్యార్థులకు కేవలం ఒక హిందీ ఉపాధ్యాయున్ని మాత్రమే నియమించాలని ఉత్తర్వులు ఇవ్వడం బాధాకరమన్నారు. ఇతర సబ్జెక్టులకు కేటాయించిన విధంగా 240 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు నిష్పత్తి ప్రకారం హిందీ ఉపాధ్యాయులను కూడా నియమించాలని చెప్పారు.

మెర్జ్‌ అయిన ఉన్నత పాఠశాలల్లో, ప్రాధమిక పాఠశాలల్లో 3వ తరగతి నుంచి హిందీ భాషా బోధనను ప్రవేశపెట్టాలన్నారు. మిగిలిన సబ్జెక్టులతో సమానముగా హిందీకి 2 పేపర్లను ప్రవేశపెట్టాలని ఉత్తీర్ణత మార్కులను 35 కు పెంచాలన్నారు. దీనికోసం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక హిందీ ఉపాధ్యాయుడిని నియమించాలని, దీనివల్ల విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే జాతీయ భాష నేర్చుకునే అవకాశం దొరుకుతుందన్నారు. హిందీ సబ్జెక్టుకు 240 : 1 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement