Friday, May 3, 2024

బట్టలు కుట్టించటానికి వెళ్తే…టైలర్ ఏం చేశాడో తెలుసా ?

కొత్త చట్టాలు వస్తున్నాయి… శిక్షలు పడుతున్నాయి. అయినా కామాంధుల తీరు మాత్రం మారటం లేదు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే విధంగా శ్రీకాళహస్తిలో ఓ సంఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నందు నాలుగో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఆ ప్రాంతంలో టైలర్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. అది గమనించిన స్థానికులు సదరు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇదే విషయమై బాలిక తల్లి మాట్లాడుతూ తన కుమార్తె బట్టలుకుట్టించు కోవడానికి టైలర్ వద్దకు వెళ్లగాఆ వ్యక్తి తమ కుమార్తెను ఇంటిలో నిర్బంధించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని వాపోయింది. ఇటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement