Wednesday, May 8, 2024

ఆ ఎర్రటి నక్షత్రాల గుట్టు తెలుసా ?.. కనిపెట్టిన భారతీయ శాస్ర్తవేత్త

న్యూఢిల్లీ-పాలపుంతలో లక్షలాది నక్షత్రాలున్నాయి. వాటిలో మన కళ్లకు మినుకుమినుకుమంటూ కన్పిస్తే కొన్ని కాస్త ఎక్కువ వెలుగుతో కనిపిస్తాయి. చిమ్మచీకటిలో అలాంటి నక్షత్రాలను చూస్తూ ఏవేవో ఆలోచనల్లోకి మనం వెళ్లిపోతూంటాం. కానీ, కేవలం అలా ఆలోచనల్లోనే ఆగిపోకుండా నక్షత్రాల గుట్టు తెలుసుకునేందుకు దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు భారత్ కు చెందిన ఒక శాస్ర్తవేత్త నక్షత్రాలకు సంబంధించి ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు. దాదాపు సూర్యుడిలా ఎర్రగా భగభగలాడే నక్షత్రాలకు ఆ శక్తి ఎలా వచ్చింది, కారణమేంటి, ఆ నక్షత్రాల్లో లిధియం ఎక్కువగా ఉండటానికి కారణమేంటి అన్నసందేహాలకు ఇప్పుడు జవాబు దొరికింది. సూర్యుడిలో మాదిరిగానే ఈ ఎర్రటి భారీ నక్షత్రాల్లో హీలియం మండుతూంటుందని, ఆ ద్రవరూప ఉష్ణం నుంచి లిధియం గుట్టలుగా పుట్టుకొస్తోందని తేల్చారు. నిజానికి పాలపుంతలోని అన్ని నక్షత్రాలు ఇలా ఉండవి. ఎర్రగా మండుతూ కన్పించే కొన్ని రాకాసి నక్షత్రాలే ఇన్నాళ్లూ సవాలక్ష సవాళ్లు విసిరాయి. వీటి గుట్టు తేల్చడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ర్టోఫిజిక్స్ (ఐఐఏ)కు చెందిన ప్రొఫెసర్ దీపక్, ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ప్రొ.లాంబర్ట్ పరిశోధనలు చేశారు.

ఆ ఫలితాలపై వారు రాసిన సిద్ధాంతాలు ప్రఖ్యాత రాయల్ ఆస్ర్టానమికల్ సొసైటీవారి నెలవారీ పత్రాలలో ప్రచురితమయ్యాయి. వారి సిద్ధాంతం ప్రకారం సూర్యూడి మాదిరిగానే ఈ భగభగమండే రాకాసి నక్షత్రాల్లో హీలియం ప్లాస్మానుండి లిధియం ఉత్పత్తి అయి నక్షత్రాల ఉపరితలంపై పేరుకుంటోంది. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం రాకాసి నక్షత్రాలను గుర్తించారు. వీటిలో లిథియం ఎందుకు, ఎలా ఉత్పత్తి అవుతోందన్నది మిస్టరీగా మారింది. ఆస్ర్టేలియం ఆస్ర్టోఫిజకల్ లాబరేటీరితో పాటు మరికొన్ని అబ్జర్వేటరీలనుంచి తెప్పించిన 5 లక్షల నక్షత్రాల సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించారు. ఆ నక్షత్రాలను మళ్లీ రెండుగా విభజించి డేటాను పరిశీలించారు. భగభగమండే రాకాసి నక్షత్రాలలో లిథయం నిల్వలు ఉండటానికి హీలియం మంటలే కారణమని తేల్చారు. భూ వాతావరణంలో లిథియం ఆనవాళ్లు కనిపెట్టిన నేపథ్యంలో ఈ నక్షత్రాలపై పరిశోథనలకు ప్రాధాన్యం ఏర్పడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement