Thursday, May 26, 2022

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ఎన్టీఆర్ రూ. 25ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం ..

ఏపీ వ‌ర‌ద బాధితుల కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 25ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ఇచ్చారు. ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ఆర్థిక‌స‌హాయం చేసిన మొట్ట మొద‌టి న‌టుడిగా నిలిచారు ఎన్టీఆర్ . ఏపీ ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకునేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా మరణించిన వారికి ఐదు లక్షల పరిహారం ఇస్తుంది.కాగా టిడిపి అధినేత చంద్రబాబు కూడా పార్టీ తరపున వరద బాధితులకు లక్ష రూపాయలు ఇస్తున్నట్లు వెల్ల‌డించారు. ఎన్టీఆర్ ను చూసి మిగ‌తా న‌టులు ఎవ‌రైనా స్పందిస్తారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement