Monday, April 29, 2024

మెజార్టీలో శివ‌కుమార్ కింగ్ ..ల‌క్ష‌కు పైగా ఓట్ల‌తో గెలుపు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. 224 సీట్ల అసెంబ్లీలో కొంతమంది కొత్త సభ్యులు కొద్దిపాటి ఓట్ల తేడాతో గెలుపొందగా, మరికొందరు దుమ్ము దులిపేసారు. తమ సమీప అభ్యర్థిపై 50,000 లేదా అంతకంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ 1,22,392 ఓట్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచారు. శివకుమార్‌కు 1,41,117 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి జనతాదళ్-సెక్యులర్‌కు చెందిన నాగరాజుకు 20,518 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆర్ అశోక్ 19,743 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆయన 1989 నుండి తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు.

50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ స్థానాలివే..
అథని అసెంబ్లీ నియోజకవర్గం: ముంబై-బెంగళూరు ప్రాంతంలోని బెలగావి జిల్లాలోని అథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత లక్ష్మణ్ సంగప్ప సవడి 76,122 ఓట్ల తేడాతో గెలుపొందారు. సవాడికి 1,31,404 (68.34 శాతం) ఓట్లు రాగా, అతని సమీప ప్రత్యర్థి, బిజెపికి చెందిన మహేష్ కుమతల్లి 55,282 (28.75 శాతం) ఓట్లు మాత్రమే సాధించగలిగారు.
బెల్గాం రూరల్‌: బెల్గాం రూరల్‌లో కాంగ్రెస్‌ నాయకురాలు లక్ష్మీ హెబ్బాల్కర్‌ 56,016 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి నగేష్‌ మనోల్కర్‌పై విజయం సాధించారు.
చామరాజ్‌పేట: బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన చామరాజ్‌పేటలో కాంగ్రెస్‌ నాయకుడు బిజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ తన సమీప ప్రత్యర్థి బిజెపికి చెందిన భాస్కర్‌రావుపై 53,953 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖాన్‌కు 77631 (62.22 శాతం) ఓట్లు వచ్చాయి.
చిక్కోడి-సదల్గా: ముంబై కర్ణాటక ప్రాంతంలోని చిక్కోడి-సదల్గా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గణేష్ హుక్కేరి 78,509 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కత్తి రమేష్‌ విశ్వనాథ్‌పై 78 వేల 509 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గణేష్ హుక్కేరికి 127324 (69.76 శాతం) ఓట్లు వచ్చాయి.


చిత్రదుర్గ: కాంగ్రెస్ అభ్యర్థి కెసి వీరేంద్ర పాపి 53,300 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి జిహెచ్ తిప్పారెడ్డిపై విజయం సాధించారు. వీరేంద్ర పాపికి 1,22,021 ఓట్లు వచ్చాయి.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌: ఐఎన్‌సికి చెందిన రూపా కల 50467 ఓట్లతో బిజెపికి చెందిన అశ్విని సంపంగిపై విజయం సాధించారు. రూపకు 80,924 ఓట్లు వచ్చాయి.
కొల్లేగల్: కాంగ్రెస్‌కు చెందిన ఏఆర్‌ కృష్ణమూర్తికి 1,08,363 (64.59 శాతం) ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్‌ మహేష్‌కు 48,834 (29.11 శాతం) ఓట్లు వచ్చాయి. గెలుపు మార్జిన్ 59,519.
కూడలిగి: కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ఎన్‌టీకి 1,04,753 (63.95 శాతం) ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన లోకేష్ నాయక్‌కు 50,403 (30.77 శాతం) ఓట్లు వచ్చాయి. గెలుపు ఓట్ల తేడా 54,350.
పులకేశినగర్‌: బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పులకేశినగర్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అభ్యర్థి అకండ శ్రీనివాస్ మూర్తి ఆర్‌పై ఐఎన్‌సికి చెందిన ఎసి శ్రీనివాస్ 62,133 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శ్రీనివాస్‌కు 87,214 (66.72 శాతం) ఓట్లు రాగా, అకండశ్రీనివాస్ మూర్తికి 25,081 (19.18 శాతం) ఓట్లు వచ్చాయి.
సర్వగణనగర్‌: కాంగ్రెస్‌ నేత కేలచంద్ర జోసెఫ్‌ జార్జ్‌ బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డిపై 55,768 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జార్జికి 1,18,783 (61.04 శాతం) ఓట్లు వచ్చాయి.
యమకనమర్డి: కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ జార్కిహోళి 57,211 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి బసవరాజ్ హుంద్రిపై విజయం సాధించారు.
50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు వీరే
బసవనగుడి: బీజేపీ నేత రావి సుబ్రహ్మణ్య ఎల్. 54,978 ఓట్ల తేడాతో గెలుపొందారు. సుబ్రమణ్యం 78,854 (61.47 శాతం) ఓట్లు సాధించారు. అతని సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన యు.బి. వెంకటేష్‌కు 23,876 (18.61 శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఖానాపూర్: బిజెపి నాయకుడు విఠల్ సోమన్న హల్గేకర్ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సికి చెందిన డాక్టర్ అంజలి హేమంత్ నింబాల్కర్‌పై 54629 ఓట్ల తేడాతో 91,834 (57.04 శాతం) ఓట్లతో విజయం సాధించారు.
మహాలక్ష్మి లేఅవుట్: బీజేపీ నేత కె. గోపాలయ్య 96,424 ఓట్లతో (మొత్తం ఓట్లలో 60.6 శాతం) తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన కేశవమూర్తిని 51,165 ఓట్ల తేడాతో ఓడించారు.
పద్మనాభనగర్: బీజేపీకి చెందిన ఆర్ అశోక్ 55,175 ఓట్ల తేడాతో ఐఎన్‌సికి చెందిన వి రఘునాథ్ నాయుడుపై విజయం సాధించారు. అశోక్‌కు 98,750 ఓట్లు రాగా, మొత్తం ఓట్లలో 61 శాతం ఓట్లు వచ్చాయి. నాయుడుకు 43,575 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement