Monday, May 6, 2024

అట్లుంట‌ది మ‌న‌తోని అంటోన్న – అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్

డీజేటిల్లు2 చిత్రానికి హీరోయిన్ క‌న్ ఫ్మాం అయిపోయింది.ఈ మేర‌కు ట్వీట్ చేశాడు హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఈ పోస్ట్‌తో డీజేటిల్లు2 హీరోయిన్ ఎవ‌ర‌నేదానిపై సిద్దు క్లారిటీ ఇచ్చేశారు. డీజే టిల్లు 2ను పీడీవి ప్రసాద్ స‌మ‌ర్పిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ తెర‌కెక్కిస్తున్నారు.కాగా సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టిల్‌ను షేర్ చేశారు. అట్లుంట‌ది మ‌న‌తోని అని రాసి ఉన్న బ్లాక్ టీష‌ర్ట్ ను అనుప‌మ వేసుకుంది. టీ ష‌ర్ట్ బాగుంది అను..అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.మొత్తానికి డీజే టిల్లు 2లో హీరోయిన్ అనుప‌మనే అని చెప్ప‌క‌నే చెప్పేశాడంటూ తెగ చ‌ర్చించుకుంటున్నారు ఈ పోస్ట్ చూసిన సినీ జ‌నాలు, మూవీ ల‌వ‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement