Thursday, April 25, 2024

యూట్యూబ్ నుండి వెండితెర‌కి.. ఇప్పుడిప్పుడే ఆఫ‌ర్స్ అందుకుంటోన్న దివ్య శ్రీపాద‌

యూట్యూబ్ నుండి వెండితెర‌కి వెళ్లింది దివ్య శ్రీపాద‌. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. కుర్రాళ్లకు ఎక్కువగా కనెక్ట్ అయింది ఆమె కళ్లు. ఇంత అందమైన కళ్లున్న ఏఈ అమ్మాయి ఎవరబ్బా అనే సెర్చింగ్ అప్పుడే మొదలైంది. ఆ కళ్లలోని ప్రత్యేకమైన ఆకర్షణనే ఆమెకి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. నటన విషయంలోనూ వంక బెట్టవలసిన అవసరం లేకపోవడంతో అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మోడ్రన్ డ్రెస్సుల్లో పట్నం పిల్లగా .. చీరకట్టులో అచ్చు పల్లెటూరు అమ్మాయిలా కనిపించే దివ్య శ్రీపాద, ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ .. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళుతోంది. ఈ మధ్య కాలంలో చేసిన ‘స్వాతిముత్యం’ .. ‘యశోద’ సినిమాలు ఆమెకి మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. రేపు రిలీజ్ కానున్న ‘పంచతంత్రం’ సినిమాలోను ఆమె చెప్పుకోదగిన పాత్రనే చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement