Thursday, April 25, 2024

Hyd: బీజేపీ ఆఫీసు ముందు అగ్నిప్ర‌మాదం..

గుజరాత్ లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించిన విష‌యం విధిత‌మే. ఈనేప‌థ్యంలో హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ పార్టీ కార్యాలయం వ‌ద్ద బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. నిప్పు రవ్వలు భారీగా చెలరేగి బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పాటు కరెంట్ తీగలు కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నేతలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement