Monday, May 13, 2024

రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులకు డిప్తీరియా నిరోధక టీడీ టీకాల పంపిణీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొవిడ్‌ అనంతరం ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను ధనుర్వాతం, కోరింత దగ్గు (డిప్తీరియా) బెంబేలెత్తిస్తోంది. 2015లో దేశంలో 35శాతంగా ఉన్న డిప్తీరియా ఈ సంవత్సరానికి 65శాతానరికి చేరినట్లు వైద్య, ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. దీంతో ధనుర్వాతం, కంఠ సర్పి (టీడీ-టెటానస్‌ డీప్తీరియా) వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు నెల 19 తేదీ వరకు 12రోజులపాటు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని జిల్లాల్లో చేపట్టనున్నారు.

విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 5-10 (10-16 ఏళ్ల వయసు ఉన్న పిల్లందరికీ) తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 -10 తరగతి చదువుతున్న చిన్నారులు 8లక్షల దాకా ఉంటారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్‌ వేస్తారు. బయడి బయట పిల్లలకూ ఈ టీకా ను ఇస్తారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సంగారెడ్డి జిల్లాతోపాటు పలు జిల్లాల్లో టెటానస్‌ డీప్తిరియా వ్యాధి నివారణకు ఇచ్చే వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది.

పిల్లల ఎడమ చేతికి టీడీ వ్యాక్సిన్‌ ఇస్తారని, ఈ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండివని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కొద్ది మందిలో మాత్రమే స్వల్ప జ్వర లక్షణాలు వస్తాయంటున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకు మాత్రం వైద్య నిపుణుల సూచనల అనంతరమే టీడీ వ్యాక్సిన్‌ను వేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డిప్తీరియా వ్యాధికి గురైన వారు ఎడతెరిపి లేకుండా దగ్గడం, కళ్లవెంట నీరు కారడంతోపాటు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చిన్నారులను సమీపంలోని ఆదసుపత్రులకు తీసుకెళ్లాలని మంత్రి హరీష్‌రావు తల్లిదండ్రులకు సూచించారు. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యం తప్పదని చెబుతున్నారు. ఈ ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమంలో విస్తృతంగా భాగస్వామ్యం కావాలని తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement