Saturday, May 4, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైపులైనుకు 22.4 కి.మీ, 24.05 కి.మీల వద్ద ఏర్పడ్డ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్ట‌నున్నారు జలమండలి అదికారులు.

కాగా, ఈ నెల 19న‌(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 20వ తేది (గురువారం) సాయంత్రం 6 గంటల వరకు ఈ మ‌రమ్మ‌తు పనులు జరుగనున్నాయి. ఈ 36 గంటల పాటు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగనుంద‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

పాక్షికంగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్-6(ఎస్.ఆర్.నగర్): బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.
  2. ఓ అండ్ ఎం డివిజన్-9(కూకట్ పల్లి): కేపీహెచ్ బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
  3. ఓ అండ్ ఎం డివిజన్-15 (శేరిలింగంపల్లి): లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్ నగర్, మయూరి నగర్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
  4. ఓ అండ్ ఎం డివిజన్-23(నిజాంపేట్): ప్రగతినగర్ లో కొన్ని ప్రాంతాలు, నిజాంపేట్/ బాచుపల్లి.

పూర్తిగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్-9(కూకట్ పల్లి): ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు.
  2. ఓ అండ్ ఎం డివిజన్-12(కుత్బుల్లాపూర్): షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల/ వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
  3. ఓ అండ్ ఎం డివిజన్- 13 (మల్కాజిగిరి/ అల్వాల్): సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
  4. ఓ అండ్ ఎం డివిజన్-14(ఉప్పల్): కాప్రా మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు. సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
  5. ఓ అండ్ ఎం డివిజన్-19(నాగారం/ దమ్మాయిగూడ): నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ఆర్జీకే ప్రాంతాలు.
  6. ఓ అండ్ ఎం డివిజన్-24(బొల్లారం): రింగ్ మెయిన్ – 3 ఆన్ లైన్ సప్లై.
  7. ఓ అండ్ ఎం డివిజన్-25(కొంపల్లి): కొంపల్లి, గొండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దేవరయాంజల్, హకీంపేట్ ప్రాంతాలు.
  8. ఆర్డబ్ల్యూఎస్ ఆప్ టేక్ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి) ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట్), కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు.

కాగా, పైన పేర్కొన్న నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని జలమండలి అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement