Friday, May 3, 2024

మాస్ కా దాస్ ఓటీటీ ఎంట్రీ.. త్వ‌ర‌లో విశ్వక్‌సేన్ ఎంటర్‌టైన్మెంట్ షో

కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్‌.. ఫస్ట టైమ్ ఓటీటీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా తన ఎనర్జీ, యాక్టింగ్ స్కిల్స్‌తో వెండితెర ప్రేక్షకుల‌ను అల‌రించిన విశ్వక్.. త్వరలోనే ‘ఆహా’ ఆడియన్స్‌ను అల‌రించడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు ఇప్పటిదాకా చూడనటువంటి అవతార్‌లో కనిపించనున్నాడు. ఈ మేరకు 15 ఎపిసోడ్స్‌‌తో కూడిన ఎంటర్‌టైన్మెంట్ షోను ‘ఆహా’ సిద్ధం చేస్తుండగా.. త్వర‌లో అఫిషియల్‌గా ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే సమంత, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్స్‌తో టాక్ షోస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ఆహా.. ప్రస్తుతం టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌తో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement