Monday, April 29, 2024

Delhi | బీఆర్ఎస్ బీబీ పాటిల్‌కు సుప్రీంలో నిరాశ.. అనర్హత పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల సమయంలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌పై రోజువారీ విచారణ చేపట్టాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఎస్. రవీంద్ర భట్, అరవింద్ కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపి తీర్పునిచ్చింది. తీర్పు కాపీ మంగళవారం బహిర్గతమవగా.

అందులో ఆయనకు ఎలాంటి ఊరట లభించలేదు. 2019లో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి పోటీ చేసి గెలుపొందిన బీబీ పాటిల్, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో కె. మదన్‌మోహన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అక్రమాల కేసులను త్వరితగతిన విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని, జాప్యం కారణంగా తీర్పు వచ్చే సరికి పదవీకాలం పూర్తయిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రోజువారీ విచారణకు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. బీబీ పాటిల్ వాదనల్లో మెరిట్స్ లేనందున పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నామంటూ తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement