Tuesday, May 7, 2024

ఆడ‌వారికి ఒక న్యాయం .. మ‌గ‌వారికి మ‌రో న్యాయ‌మా -ర‌ణ‌వీర్ సింగ్ కి స‌పోర్ట్ చేస్తోన్న వ‌ర్మ‌

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏ విష‌యంలో రియాక్ట్ అవుతారో..ఏ విష‌యంలో రియాక్ట్ అవ్వ‌రో ఎవ‌రికి తెలియ‌ని ప‌రిస్థితి. కాంట‌వ‌ర్సీల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటారు ఈ ద‌ర్శ‌కుడు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ కి .. రామ్ గోపాల్ వ‌ర్మ మ‌ద్ద‌తు ప‌లికారు ..రణవీర్ సింగ్ ఇటీవలే ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ గ ఆ ఫొటో షూట్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను ఆయనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై కొందరు మహిళలు ముంబై పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. నటుడి చర్యను కొందరు సమర్థిస్తుంటే, కొందరు విమర్శిస్తున్నారు. మద్దతుదారుల్లో ఇప్పుడు వర్మ కూడా చేరిపోయారు. బమహిళలు తమ శృంగారాత్మక శరీరాలను చూపించినప్పుడు పురుషులు ఎందుకు చేయకూడదు.. మగవారిని భిన్న ప్రమాణాలతో చూడడం కపటం. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. మహిళలు తమ శరీరాలను ప్రదర్శించగా లేనిదీ, పురుషులు ఆ పని ఎందుకు చేయకూడద‌ని ఆయన ప్రశ్నించారు. లింగ సమానత్వానికి న్యాయం చేయాలని కోరడం రణవీర్ మార్గం కావచ్చని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement