Wednesday, May 1, 2024

MI vs RCB | ఆఖర్లో చెల‌రేగిన దినేష్ కార్తీక్.. ముంబై టార్గెట్ ఎంతంటే

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ముంబైతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు పోరడే టార్గెట్‌ను సెట్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నిష్టానిక 196 పరగులు చేసింది. గ‌త మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన విరాట్ కోహ్లీ(3) ఔట‌య్యాడు. ఆ కాసేప‌టికే అరంగేట్రం బ్యాట‌ర్ విల్ జాక్స్ కూడా (8)కే వెనుదిరిగాడు. దాంతో 23 పరుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రజత్ పాటిదర్, కెప్టెన్ ఫాప్ డుప్లిసిస్ ఆదుకున్నారు.

రజత్ పటీదార్ (50) అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ (61) కూడా అర్థ సెంచరీతో చెలరేగాడు. అయితే, గ్లెన్ మాక్స్‌వెల్ మరోసారి (0) డకౌట్ అయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది మూడో డకౌట్. ఇక 13వ వచ్చిన దినేష్ కార్తీక్ ఆఖరి ఓవర్లలో రెచ్చిపోయాడు. 23 బంతుల్లో 53 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ సాధించి ముంబై ముందు భారీ టార్గెట్ సెట్ చేయడంలో స‌హాయ ప‌డ్డాడు.

ఇక ముంబై బౌల‌ర్ల‌లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ ద‌క్కించుకున్నారు. ఇక ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 197 ప‌రుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement