Saturday, May 4, 2024

ఊర‌మాస్ గా నాని-పోస్ట‌ర్ రిలీజ్

ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెలా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ద‌స‌రా. ఈ మూవీలో నేచుర‌ల్ స్టార్ హీరో నాని న‌టిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రంలో నాని, కీర్తి డీ గ్లామర్‌ పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం నాని తన రెమ్యునరేషన్‌ కూడా తగ్గించుకున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నాన్‌-థియేట్రికల్‌ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌చేశాయి. తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’ పాటను అక్టోబర్‌ ౩న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా చేశారు. ఈ పోస్టర్‌లో నాని ఊరమాస్‌ అవతారంలో కనిపిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement