Friday, May 3, 2024

Devgiri Express – ప‌ట్టాల‌పై రాళ్ల‌తో డ్ర‌మ్ము.. దేవ‌గిరి ఎక్స్ ప్రెస్ కి తృటిలో త‌ప్పిన ముప్పు

ఔరంగాబాద్‌: ముంబయి – సికింద్రాబాద్‌ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును గుర్తించిన డ్రైవర్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసి రైలును ఆపారు. దీంతో ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో నేటి తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

ముంబయి నుంచి సికింద్రాబాద్ బయల్దేరిన ఈ రైలు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సతోనా – ఉస్మాన్‌పుర్‌ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా పట్టాలపై ఏదో వస్తువు ఉండటాన్ని లోకోపైలట్‌ గుర్తించారు. అప్రమత్తమైన పైలట్‌ రైలును ఆపి కిందకు దిగి చూడగా ట్రాక్ మధ్యలో రాళ్లలో నిండిన డ్రమ్ము కన్పించింది. దీంతో అత్య‌వ‌స‌ర బ్రేకులు ఉప‌యోగించి రైలును నిలిపివేశాడు.. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.. ఈ స‌మాచారాన్ని లోకోపైలట్‌ వెంటనే రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్‌పీఎఫ్‌)కి సమాచారమిచ్చారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని డ్రమ్మును తొలగించారు. ఆ తర్వాత రైలు తిరిగి సికింద్రాబాద్‌ బయల్దేరింది. ఈ ఘటనలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement